బండర్ పల్లిలో మార్చి 30 నుండి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని బండర్ పల్లి గ్రామంలోని అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 44వ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ ఉత్సవాలలో భాగంగా యజ్ఞా కార్యక్రమాలు, ఏప్రిల్ 2న స్వామివారి కల్యాణోత్సవం, రాత్రి రథోత్సవం జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్