వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం ఎస్సీ వాడలో ఆదివారం ఆడుకుంటూ అడవి ఆముదం కాయలు తిన్న నందిని, నైని, కిషోర్, ఆనంది, హేమంత్, రక్షిత, యశ్వంత్, హిమాన్షు, సౌమ్య అనే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందరికీ వాంతులు కావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.