మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలు ఎమ్మెల్యేని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ మహిళా కార్యదర్శి వహిదా బేగం, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.