అలంపూర్: పశుగ్రాసం దగ్ధం.. రైతు ఆవేదన

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. తలారి శ్రీను అనే రైతు తన కల్లం దొడ్డిలో నిల్వ ఉంచిన పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 వేల విలువైన పశుగ్రాసం దగ్ధమైందని, తన పశువులకు మేత లేక ఇబ్బందులు పడుతున్నానని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయం అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్