ఢిల్లీలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళి అర్పిస్తూ, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు ఎస్. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ, ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని, దేశంలో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.