జోగులాంబ గద్వాల జిల్లాలో, ఉండవెల్లి మండలం ప్రాగటూరు గ్రామానికి చెందిన బోయ చామంతి (17) అనే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సప్లిమెంటరీ పరీక్షల్లో మరోసారి ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది, ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.