అలంపూర్: పెట్రోల్ కోసం... యువకుడి వినూత్న ఆలోచన

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం కేంద్రానికి చెందిన అల్తాఫ్ అనే యువకుడు సోమవారం వినూత్నంగా ఆలోచించాడు. బాటిళ్లలో పెట్రోల్ పోయబోమన్న నిబంధనతో, ఏకంగా బైక్ ట్యాంకును విడదీసి బంకుకు తీసుకెళ్లాడు. నిబంధనలు పాటిస్తూనే పని పూర్తి చేసుకున్న ఈ యువకుడి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్