అలంపూర్: భారీ చోరీ.. రూ. 50 లక్షల సిగరెట్లు ఎత్తుకెళ్లిన దొంగలు

సుమారు రూ.50 లక్షలకు పైగా సిగరెట్లు చోరీ అయిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీలో జయలక్ష్మి ఏజెన్సీలో సుమారు రూ. 50 లక్షలకు పైగా సిగరెట్లు తెల్లవారుజామున 3: 00 గం. ప్రాంతంలో దొంగిలించారు. యజమాని వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనంలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు సీసీలో రికార్డు అయింది.

సంబంధిత పోస్ట్