అలంపూర్: అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్కెట్

అలంపూర్ నియోజకవర్గం అయిజ మండల కేంద్రంలో రూ. 3 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ ప్రారంభించి 20 నెలలు గడిచినా నేటికీ నిరుపయోగంగా ఉందని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం పార్టీ శ్రేణులతో మార్కెట్ ను సందర్శించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలనే ఈ దుస్థితి వచ్చిందని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భగత్ రెడ్డి, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్