జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలం జల్లాపురం స్టేజ్ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నుంచి హైదరాబాద్ కు మామిడిపండ్ల లోడ్ తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో ఉన్న అనిల్, భానుప్రకాశ్ సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ లో క్షతగాత్రుడిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.