జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు, రేషన్ కార్డుల పంపిణీలో గురువారం ఎమ్మెల్యే విజయుడు, మార్కెట్ ఛైర్మన్ దొడ్డప్ప మధ్య స్వల్ప వివాదం నెలకుంది. దొడ్డప్ప మాట్లాడే సమయంలో బీఆర్ఎస్ పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ నేతలు రేషన్ కార్డులకు డబ్బులు తీసుకుంటున్నారని, మట్టి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి వారిని సముదాయించారు.