అలంపూర్: గ్రామీణ వృద్ధులకు ఎమ్మెల్సీ వేసవి సూచనలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం కోదండాపురంలో బుధవారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పర్యటించారు. గ్రామంలోని రచ్చకట్ట వద్ద కూర్చున్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం ముగిసే వరకు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని, తరచూ మజ్జిగ, చల్లటి మంచినీరు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లవద్దని వారికి తెలిపారు. వృద్ధులకు చలివేంద్రాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్