జోగులాంబ గద్వాల జిల్లా పోక్సో కోర్టు, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పింజరి పెద్ద హుస్సేన్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 20 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. అలంపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిందితుడు 2021లో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయగా, అలంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.