అలంపూర్: ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు

మంగళవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి-44 పై ఆటో బోల్తా పడింది. దైవదర్శనం ముగించుకుని తక్కశిల గ్రామానికి తిరిగి వస్తుండగా డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్