పారదర్శకంగా కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం జరుగుతుందని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఇటీవల నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన ఆయన బుధవారం గాంధీభవన్ లో నల్గొండ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నియోజకవర్గాలు, బ్లాక్, మండల కాంగ్రెస్ కమిటీల వివరాలను సేకరించారు.