తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అలంపూర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి, రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గతంలో ఏడాదికి ఒకసారి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తున్నామన్నారు. 2,600 మహిళా సంఘాలకు రూ. 3.15 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు.