గద్వాల వద్ద కారులో భారీ అగ్నిప్రమాదం: ప్రయాణికులు సురక్షితం

జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలం పూటాన్ పల్లి స్టేజ్ సమీపంలో ఆదివారం గద్వాల వైపు వస్తున్న కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు, కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలకలం రేగింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్