జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్, గద్వాల్‌లోని దేవబండ గ్రామానికి చెందిన రాజేంద్ర గౌడ్ అనే యువకుడు ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ టెక్నికల్ జవాన్‌గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మారుమూల గ్రామం నుండి దేశ సేవకై ఆర్మీలో ఉద్యోగం సాధించడం ద్వారా గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టారని గ్రామస్తులు కొనియాడారు.