గద్వాల: 32 ద్విచక్ర వాహనాలు, ఆటో, ట్రాక్టర్ పట్టివేత

జోగుళాంబ గద్వాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ వై. మొగిలయ్య ఆధ్వర్యంలో మల్డకల్ మండలంలోని డి అమరవాయి గ్రామంలో గురువారం సాయంత్రం 'కార్డెన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై విచారణ జరిపి, సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.

సంబంధిత పోస్ట్