జోగులాంబ గద్వాల జిల్లా రూరల్ మండలం ఈడిగోనిపల్లిలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుర్వ లింగన్నకు చెందిన ఎద్దు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో రైతు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఈ ఎద్దు విలువ సుమారు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుందని, దాని మృతితో తాము తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యామని రైతు లింగన్న తెలిపారు.