జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం ఈడిగోనిపల్లికి చెందిన కురువ శివకు ఆపరేషన్ నిమిత్తం రూ. 3 లక్షల విలువైన ఎల్బీసీని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.