గద్వాల: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు: ఎంపీ అరుణ

పాలమూరు ఎంపీ డీకే అరుణ సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం వల్ల రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలని, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే, వ్యవసాయ మంత్రి, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్