జోగులాంబ గద్వాల నియోజకవర్గంలోని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ధరూర్ మండలంలోని నెట్టెంపాడు, నాగర్ దొడ్డి, మాల్ దొడ్డి, గార్లపాడు, ఖమ్మంపాడు గ్రామాల్లో పర్యటించి ఎమ్మెల్యే మద్దతుదారుల తరపున ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని ముంపు గ్రామాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తన హయాంలో అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు.