గద్వాల: ఎన్నికల భద్రత.. మద్యం, నగదు పంపిణీపై కఠిన నిఘా

ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం, నగదు పంపిణీపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీజీ డి. ఎస్. చౌహన్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన దిశానిర్దేశం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు స్పందిస్తూ, జిల్లాలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు ముగిసే వరకు నిరంతరం నిఘా కొనసాగుతుందని వివరించారు.

సంబంధిత పోస్ట్