మహాలక్ష్మి పథకం మహిళలకు స్వేచ్ఛ, భరోసా కల్పిస్తూ వారి ఆర్థిక భారం తగ్గించి సాధికారతను పెంపొందిస్తున్నదని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం గద్వాల ఆర్టీసీ డిపోలో మహాలక్ష్మి పథకం ద్వారా 290 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగి ₹10,000 కోట్ల ప్రయాణ చార్జీలు ఆదా అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు చేసిన తొలి పథకం మహాలక్ష్మి (ఉచిత బస్సు) పథకమని, మహిళల సాధికారతకు ఇది ఒక కీలక అడుగు అని కలెక్టర్ పేర్కొన్నారు.