గద్వాల: వైభవంగా మల్దకల్ తిమ్మప్ప స్వామి వారి రథోత్సవం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో వెలిసిన స్వయంభు తిమ్మప్ప స్వామి వారి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భక్తులు గోవింద నామస్మరణలతో రథాన్ని లాగారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నడిగడ్డ ప్రజలను చల్లంగా చూడాలని భక్తులు కోరుకున్నారు. ఈ కన్నుల పండుగ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్