గద్వాల: ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నర్సన్ దొడ్డిలో రేణుక దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప ప్రారంభించారు. పేదల సంక్షేమం కోరి సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. ఇల్లు నిర్మాణంలో ఉన్నవారు వెంటనే పూర్తి చేసుకొని ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్