గద్వాల: మద్యం మత్తులో పరస్పర దాడులు- సీఐ

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఐదుగురు యువకులు మద్యం మత్తులో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇంటికి వెళ్లే విషయంలో ఫొటో షాపు వద్ద వంశీ, అరవింద్, బులెట్ వంశీ, వసంత్, బన్నీ మధ్య గొడవ జరిగి, చిన్న చాకులతో దాడి చేసుకున్నారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్