జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండల కేంద్రంలో, విద్య, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని గాజుల కృష్ణారెడ్డి, ఎల్, భీమ్ రెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్ రాములు తెలిపారు. ఈ నెల 9న ఆదివారం గద్వాల వాల్మీకి భవన్ లో జరిగే 'బీసీ చైతన్య సదస్సు'లో బీసీలంతా తరలి వచ్చి ఐక్యతను చాటి, రిజర్వేషన్ల నినాదాన్ని ఢిల్లీ వరకు వినిపించాలని పిలుపునిచ్చారు. బిసిల హక్కులను కాలరాసేందుకు, ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలను విమర్శించారు.