గద్వాల: గుంతలో పడిన కారు, బైక్. తప్పిన ప్రమాదం..!

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల-అయిజ రహదారి మెలచెర్వు చౌరస్తా పిల్లిగుండ్ల కాలనీలో రోడ్డు పనుల్లో భాగంగా తవ్విన గుంతలో బుధవారం కారు, బైక్ పడిపోయాయి. స్థానికులు జెసిబి సహాయంతో కారును, ద్విచక్ర వాహనాన్ని, వ్యక్తిని బయటకు తీశారు. రోడ్డు పనుల్లో ఎలాంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్