జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామంలో గురువారం మొసళ్లు కలకలం రేపాయి. ఎస్సీ కాలనీ సమీపంలోని కుంట నుండి ఒక మొసలి రోడ్డుపైకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరో రెండు మొసళ్లు కూడా సంచరిస్తూ ఒడ్డుకు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, పురుషులు బహిర్భూమికి వెళ్ళే దారిలో మొసళ్లు సంచరించడం తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఆరు అడుగులకు పైగా ఉన్న మొసలి చేపను పట్టిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు.