గద్వాల: గుండెపోటుతో మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ మృతి.!

గద్వాల మండలం మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలోని అనంతపురం గ్రామానికి సర్పంచ్‌గా, గద్వాల మండలానికి ఎంపీపీగా పనిచేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్