జోగులాంబ గద్వాల జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమలత మంగళవారం ఒక కీలక తీర్పు వెలువరించారు. భర్త హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున జరిమానా విధించారు. అలంపూర్ కు చెందిన కృష్ణవేణి, తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. 2019లో నమోదైన ఈ కేసులో కృష్ణవేణి, ఎస్. మహేశ్, మహేశ్, మహేంద్ర, సూరిలకు ఈ శిక్ష పడింది. ఈ వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.