గద్వాల: ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల

జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలంలో గురువారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారు మాధవి ఇంటిని ప్రారంభించి, కానుకను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు 5 లక్షల సాయంతో ఇళ్లు మంజూరు చేసిందని, నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు కాగా, 2,000 నిర్మాణంలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్