గద్వాల: మద్యం తాగించి హత్య... నిందితుడు అరెస్ట్

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మొసల్ దొడ్డి అడవి ప్రాంతంలో జనవరి 4వ తేదీన జరిగిన తిమప్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం గద్వాలలో డీఎస్పీ మొగులయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు. తిమప్పను మద్యం తాగించి హత్య చేసిన అబ్రహం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీను పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసును ఛేదించగా, డీఎస్పీ పోలీస్ సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్