గద్వాల: కాలి బూడిదైనా పామాయిల్ తోట

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం పామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో తోటతో పాటు నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన డ్రిప్‌ పరికరాలు కూడా కాలి బూడిదయ్యాయి. ఆరు ఎకరాల పంట చేతికి వచ్చే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో రైతు డివై రామన్న తీవ్రంగా నష్టపోయారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న డ్రిప్‌ పరికరాలు కూడా కాలిపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు రామన్న కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్