గద్వాల: వ్యక్తి అదృశ్యం

కేటిదొడ్డి మండల పరిధిలోని గువ్వలదిన్నె గ్రామంలో రాజవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 28వ తేదీ ఉదయం నుంచి అతను కనిపించడం లేదని గ్రామస్తులు తెలిపారు. అతని భార్య గీతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై శ్రీనివాసులు ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్