జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని మద్దూరు స్టేజ్ దగ్గర గురువారం, అయిజ నుండి కర్నూల్ వెళ్లే బస్సు ప్రయాణంలోనే మంటలు చెలరేగాయి. వెనుక టైర్ భాగంలో మంటలు ఎగిసిపడటంతో, అప్రమత్తమైన ప్రయాణికులు బస్సును ఆపి కిందకు దిగారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటం వల్ల టైర్ రేకుకు రాసుకొని మంటలు అంటుకున్నాయని ప్రయాణికులు వాపోయారు.