గద్వాల: షార్ట్ ఫిల్మ్ కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన 'పల్లెటూరి కుర్రాళ్లు' ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో ఈ చిత్రం ఎంపికైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్ లు ఈ ట్రూప్ కు బహుమతి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్