రోడ్డు భద్రతపై 'పల్లెటూరి కుర్రాళ్లు' గ్రూప్ సభ్యులు ఖదీర్, దేవేందర్, హరిప్రసాద్, రాజు, పరుశురాంలు రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం అభినందించారు. వారి చిత్రం వాస్తవానికి దగ్గరగా ఉందని కొనియాడుతూ, షార్ట్ ఫిల్మ్ చూసిన వారందరూ ట్రిపుల్ రైడింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ ప్రజలకు సూచించారు.