గద్వాల: చెరువులో విద్యార్థి గల్లంతు!

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం కొత్తపల్లికి చెందిన రాజు అనే విద్యార్థి షాద్ నగర్ పరిధిలోని మహాత్మాజ్యోతిబాఫులే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్నాడు. మంగళవారం హోలీ ఆడిన తర్వాత స్నానానికి చెరువుకు వెళ్ళినప్పుడు ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదు. తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్