జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని మార్లబీడులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ శివార్లలో చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.