గద్వాల: రైతుల సంక్షేమంలో సహకార సంఘాల పాత్ర కీలకం

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి సహకార సంఘాల కృషి ఎంతో కీలకమని తెలిపారు. రైతు వారోత్సవాల్లో భాగంగా సింగల్ విండో కార్యాలయంలో జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందుతున్నాయని, ఒకే రకమైన పంటలు కాకుండా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్