గద్వాల: నిబద్ధతతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది: కలెక్టర్

నిబద్ధత, క్రమశిక్షణతో పని చేసే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ అన్నారు. జోగులాం బగద్వాల జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా విధులు నిర్వహించి బదిలీపై హైదరాబాద్ కు వెళుతున్న రమేశ్ బాబును గురువారం కలెక్టరేట్ లో సన్మానించి, బహుమతి అందజేశారు. ఎన్నికల స్వీప్ నోడల్ అధికారిగా రమేశ్ బాబు విశేష సేవలు అందించారని ప్రశంసించారు. విధి నిర్వహణలో బదిలీలు సహజం అని అన్నారు.

సంబంధిత పోస్ట్