జోగులాంబ గద్వాల జిల్లాలోని పోతులపాడు-అలంపూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఎరుపు రంగు టి-షర్ట్, బ్లూ లోయర్ ధరించి ఉన్నాడు. ఛాతి కింద కుడివైపున నల్లని పుట్టుమచ్చ కలదు. అతని వద్ద ఉన్న బైక్ కీ ఆధారంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసిగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచారు.