జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయంతో కెనడా నుండి ఇండియాకు బయలుదేరారు. అయితే, అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఆయన ఖతార్‌లో చిక్కుకుపోయారు. దీంతో మార్చి 1న జరగాల్సిన ప్రీవెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. బుధవారం తల్లిదండ్రులు తమ కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.