జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం గుడ్డెందొడ్డిలో సుధాకర్ (25) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధాకర్‌కు మూడు సంవత్సరాల క్రితం వివాహం కాగా, అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.