ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పెండింగ్ ప్రాజెక్టుల సాధన జెఏసి (UMPPSJAC) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ఉమ్మడి జిల్లా రైతాంగానికి సాగునీటి న్యాయం జరగలేదని, దశాబ్దాలుగా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండటం వల్ల రైతుల వలసలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని జేఏసీ జిల్లా చైర్మన్ వీరభద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు.