జోగులాంబ గద్వాల జిల్లాలో సాగు నీటి కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సోమవారం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ జిల్లా కలెక్టర్‌ను కలిసి, ఎల్నీనో ప్రభావంతో వర్షాలు కురవక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు. జూరాల, RDS ప్రాజెక్టుల నుంచి సాగు నీటిని వెంటనే విడుదల చేసి, అలంపూర్, గద్వాల ప్రాంత రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకల నాగరాజు పాల్గొన్నారు.