ఉలిగేపల్లిలో రూ.10 లక్షల సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామంలో ఆదివారం రూ.10 లక్షల వ్యయంతో 260 మీటర్ల సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ కుమ్మరి లక్ష్మి, మాజీ ఎంపీటీసీ పోలీసు తిమ్మన్న, కుమ్మరి తిప్పన్న ప్రారంభించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు మెరుగుపరుస్తామని సర్పంచ్ లక్ష్మి హామీ ఇచ్చారు. గ్రామస్తులు ప్రభుత్వ నిధుల కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్